: కేసీఆర్ గారూ! దానిని ఖండిస్తారా? లేక సమర్థిస్తారా?: కిషన్ రెడ్డి


తెలంగాణ శాసనసభలో జరిగిన సంఘటనను ఖండిస్తారా? లేక సమర్థిస్తారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ వెల్ లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. శాసనసభ సంప్రదాయాలను అధికార పక్షం అపహాస్యం చేసిందని ఆయన మండిపడ్డారు. శాసనసభలో జరిగిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో చోటుచేసుకున్న ఘర్షణపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో పసలేదని, సీఎం కేసీఆర్ ప్రకటనలా చప్పగా ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News