: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ్య సమాజం తలదించుకునేలా చేశారు: బీజేపీ నేత లక్ష్మణ్


శాసనసభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులపై దాడి చేసి, సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తించారని మండిపడ్డారు. అనేక త్యాగాలు చేసి తెలంగాణను తీసుకొచ్చామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్... రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రయత్నించాల్సింది పోయి విపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేస్తోందని ఆరోపించారు. పోడియం వద్ద మార్షల్స్ రక్షణగా ఉండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై స్పీకర్ అన్ని విషయాలను బహిర్గతం చేయాలని, వీడియోను సైతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన శాసనసభ గౌరవాన్ని తగ్గించిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News