: ఎట్టకేలకు కేంద్ర బడ్జెట్ పై స్పందించిన జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎట్టకేలకు కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏ విధమైన ప్రాధాన్యతా ఇవ్వనప్పటికీ తెలుగు దేశం పార్టీ ఎన్డీయే మిత్రపక్షంగా ఎందుకు కొనసాగుతుందో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మంత్రి పదవుల కోసమే కేంద్రంలో కొనసాగితే, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న వాస్తవం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. తక్షణమే చంద్రబాబునాయుడు తన మద్దతు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.