: ఆ పత్రాలు వెనక్కివ్వండి... సీఆర్ డీఏ ఎదుట రైతుల ఆందోళన... బాబు సర్కారుకు కొత్త తలనొప్పి!
నవ్యాంధ్ర రాజధాని నిమిత్తం తామిచ్చిన అంగీకార పత్రాలను వెనక్కు తిరిగివ్వాలని కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్ డీఏ) ఎదుట రైతులు ధర్నా మొదలుపెట్టారు. ఇటీవల ల్యాండ్ పూలింగ్ కు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులు ఈ మధ్యాహ్నం వాటిని ఇచ్చేయాలంటూ ఆందోళన చేశారు. మంగళగిరి మండలం నవులూరులోని సీఆర్ డీఏ కార్యాలయానికి చేరుకున్న బేతపూడి రైతులు, తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటూ డిప్యూటీ కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు. ఇప్పటికైతే, అధికారులు తంటాలు పడి రైతులకు సర్ది చెప్పి పంపినా, ఈ తరహా ఘటనలు పెరిగితే చంద్రబాబు సర్కారుకు కొత్త తలనొప్పి మొదలయినట్టే!