: వద్దన్నా పరీక్షలు రాసిందని బాలికకు నిప్పు పెట్టిన తండ్రీ కొడుకులు


తాము వద్దని వారించినా పరీక్ష రాసిందన్న అక్కసుతో ఓ దళిత బాలిక (17)పై కిరోసిన్ పోసి నిప్పంటించారు నలుగురు దుర్మార్గులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామంలో చోటుచేసుకోగా, 70 శాతం కాలిన గాయాలతో ఆ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్ పరీక్షలకు హాజరయిందన్న కోపంతో నిందితులు ధీరజ్ యాదవ్, అతడి సోదరులు అర్వింద్, దినేష్ వారి తండ్రి రాంపర్వేష్ యాదవ్ లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో వంట చేస్తున్న బాధితురాలిని బయటకు లాకొచ్చి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. తాను చదువును కొనసాగించడం నిందితులకు ఇష్టం లేదని బాధితురాలు తన స్టేట్ మెంటులో తెలిపింది. స్కూల్ లో జరిగే ప్రతీ పరీక్షలో వారు ఫెయిల్ అయ్యేవారని, అందుకే తన చదువును అడ్డుకోవాలని చూశారని వెల్లడించింది. కొంతకాలం క్రితం ధీరజ్ తన ఫొటో తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నించగా, వీరి కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News