: మిత్రపక్షాల విమర్శలు సరికాదు... ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: వెంకయ్యనాయుడు


కేంద్ర రైల్వే, జనరల్ బడ్జెట్లపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తం చేసిన అసంతృప్తిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఎట్టకేలకు సవివరంగా స్పందించారు. ప్రభుత్వంపై మిత్రపక్షాల విమర్శలు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏవైనా సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించిన వెంకయ్య, బహిరంగ విమర్శలు సరికాదన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ నుంచి రూ. వెయ్యి కోట్లను ఏపీకి కేటాయించామన్న ఆయన, రాజధాని ప్రణాళిక పూర్తి కాగానే మరింత మేర నిధులను విడుదల చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News