: కేరళ స్పీకర్ కన్నుమూత
కేరళ శాసనసభ స్పీకర్ కార్తికేయన్ కన్నుమూశారు. 66 ఏళ్ల వయసున్న ఆయన కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఈ సాయంత్రానికల్లా కేరళకు తరలించనున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కార్తికేయన్... రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. కార్తికేయన్ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాంది సంతాపం ప్రకటించడమే కాకుండా... తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని, తిరువనంతపురం చేరుకున్నారు. కార్తికేయన్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.