: పాక్ బౌలర్ల ప్రతాపం... పీకల్లోతు కష్టాల్లో దక్షిణాఫ్రికా!
232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడింది. పాకిస్థాన్ బౌలర్లు విసురుతున్న పదునైన బంతులతో ప్రధాన బ్యాట్స్ మెన్స్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కేవలం 77 పరుగులకే దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో డికాక్ డకౌట్ కాగా, ఆమ్లా 38, డుప్లెసిస్ 27, రోసోవ్ 6, మిల్లర్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. ప్రస్తుతం డివిలియర్స్, డుమినీ క్రీజులో వున్నారు. వీరు రాణించకుంటే దక్షిణాఫ్రికా మరో ఓటమి ముందుకు వెళ్ళినట్టే. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు.