: ఒక్క పరుగూ చేయకుండానే దక్షిణాఫ్రికా పతనం మొదలు


47 ఓవర్లలో 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే ఓపెనర్ డికాక్ వికెట్ చేజార్చుకుంది. మహమ్మద్ ఇర్ఫాన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డికాక్ డకౌట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా వికెట్ల పతనం మొదలైంది. ప్రస్తుతం డుప్లెసిస్, ఆమ్లా క్రీజులో వుండగా, దక్షిణాఫ్రికా స్కోర్ 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు. అంతకుముందు పాకిస్థాన్ జట్టు 46.4 ఓవర్లకు 222 పరుగులు చేసి ఆలౌట్ కాగా, డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం స్కోర్ ను 47 ఓవర్లకు 232 పరుగులుగా సవరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News