: పాక్ తోక పేకమేడ... 10 పరుగుల తేడాలో 5 వికెట్ల సమర్పణ


41వ ఓవర్ వరకూ పటిష్ఠంగా కనిపించిన పాకిస్తాన్ జట్టు వేగంగా పరుగులు తీసేందుకు ట్రై చేసి పేకమేడలా కుప్పకూలింది. 212 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన జట్టు ఆపై కేవలం 10 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5 వికెట్లూ సమర్పించుకుంది. 42వ ఓవర్ నాలుగో బంతికి హార్డ్ హిట్టర్ అఫ్రీది 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టెయిన్ బౌలింగ్ లో డుమినీకి క్యాచ్ ఇచ్చి దొరికిపోవడంతో పాక్ 'తోక' పతనం మొదలైంది. 212 పరుగుల వద్దనే రియాజ్ వికెట్ ను, ఆపై 218 పరుగుల వద్ద మిస్బాను, 221 పరుగుల వద్ద రాహత్ అలీ, 222 పరుగుల వద్ద సోహాయిల్ ఖాన్ వికెట్లను చేజార్చుకుంది. బలమైన దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, పాకిస్తాన్ గ్రూప్ దశను దాటే అవకాశాలు మరింత కష్టం కానుండగా, దక్షిణాఫ్రికా క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ను ఖరారు చేసుకోనుంది.

  • Loading...

More Telugu News