: గవర్నర్ ప్రసంగం... విపక్షాల నిరసన: తెలంగాణ సభలో గందరగోళం


తెలంగాణ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఓ పక్క గవర్నర్ ప్రసంగం సాగుతుండగానే, టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి, గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగిస్తున్నా, గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News