: పవన్ తీరును తప్పుబట్టిన జగన్


ఐదేళ్ల క్రితం మరణించిన వైఎస్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం తగదని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నేటి ఉదయం అసెంబ్లీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పవన్ తీరును తప్పుబట్టారు. రాజధాని భూముల విషయంలో రైతులు తమంతట తామే ముందుకు వచ్చి భూములు ఇచ్చారని చెప్పడం అబద్ధమని అన్నారు. తెలుగుదేశం బయట చెబుతున్న అవాస్తవాలను అసెంబ్లీలో గవర్నర్ మరోసారి చెప్పారని, అంతకుమించి మరేమీ లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు విధానాలను అసెంబ్లీలో ఎండగడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News