: నోరు విప్పాలంటే... రూ.2 లక్షలివ్వాల్సిందే!: బ్రిటన్ డైరెక్టర్ తో నిర్భయ నేరస్తుడు ముఖేష్


యావత్తు దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటనలో దోషి ముఖేశ్ సింగ్, ఈ దుర్ఘటనపై డాక్యుమెంటరీ తీసిన బ్రిటన్ డైరెక్టర్ లెస్లీ ఉడ్ విన్ కు షాకిచ్చాడట. డాక్యుమెంటరీ నేపథ్యంలో తీహార్ జైల్లో ఉన్న ముఖేశ్ ను లెస్లీ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు తీహార్ జైలు అధికారుల నుంచి లెస్లీకి అనుమతులు ఈజీగానే వచ్చేశాయి. అధికారిక అనుమతులన్నీ తీసుకుని వచ్చిన ఆమెతో మాట్లాడేందుకు ముఖేశ్ ససేమిరా అన్నాడట. రూ.2 లక్షలిస్తే కాని నోరు విప్పేది లేదని అతడు నిస్సిగ్గుగా తేల్చిచెప్పాడట. దీంతో కంగుతిన్న లెస్లీ, సదరు విషయాన్ని డాక్యుమెంటరీ నిర్మాతలకు చెప్పి, ఎట్టకేలకు రూ.40 వేలిచ్చేందుకు ఒప్పుకున్నారట. ఆమె నుంచి రూ.40 వేలు తీసుకున్న తర్వాత కాని ముఖేశ్ నోరు విప్పలేదట. సదరు ఇంటర్వ్యూలో తాను చేసిన తప్పును ఒప్పుకోని ముఖేశ్, ఘాటు వ్యాఖ్యలు చేసి లెస్లీతో పాటు యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. డాక్యుమెంటరీపై దేశంలో నిషేధానికి కారకుడయ్యాడు.

  • Loading...

More Telugu News