: 'విష్ణునివాసం'లో అన్యమత ప్రచారం... యువకుడి అరెస్ట్
అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా హిందువులకు పరమ పవిత్రమైన తిరుమల, తిరుపతి క్షేత్రాలలో అన్యమత ప్రచారం ఆగడంలేదు. నేటి ఉదయం తిరుపతి బస్టాండు సమీపంలోని భక్తుల వసతి గృహ సముదాయం విష్ణునివాసంలో అన్యమత ప్రచారం చేస్తున్న ఒక యువకుడిని సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు వివరించారు.