: ములాయం కు సోకిన స్వైన్ ఫ్లూ... గుర్గావ్ ఆస్పత్రిలో ఎస్పీ అధినేతకు చికిత్స
దేశంలోని పలు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ నానాటికీ విస్తరిస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులపైనా దాడి చేస్తూ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఆస్పత్రల పాల్జేసిన ఈ మహమ్మారి, తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ కూ సోకింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయంకు స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్, గుర్గావ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.