: జనం రక్తాన్ని పీలుస్తున్న జలగ... కేసీఆర్: టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపణ


తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. జనం రక్తాన్ని పీలుస్తున్న జలగలా కేసీఆర్ మారారని ఆయన ఆరోపించారు. తెలంగాణ పేరిట ఇంకా ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ సర్కారు, మాటల ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన నిప్పులు చెరిగారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. రైతు సమస్యలపై సర్కారును నిలదీయనున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి... కరవు, నీటి సమస్య, అవినీతి అంశాలపై ప్రధానంగా పోరు సాగిస్తామని చెప్పారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, లేనిపక్షంలో గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుని తీరతామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News