: ఉస్మానియా లేడీస్ హాస్టల్ లో పోకిరీ... చితకబాది పోలీసులకు అప్పగించిన విద్యార్థినులు
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో రాత్రి కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ యువకుడు అమ్మాయిల వసతి గృహాల ఆవరణలోకి చొచ్చుకెళ్లాడు. దీంతో హాస్టల్ లోని అమ్మాయిలు భయంతో పరుగులు పెట్టారు. అనంతరం అమ్మాయిలందరూ కూడబలుక్కుని తమ గదుల వద్దకు వచ్చిన సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు. తదనంతరం కేంపస్ లోని పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటీన అక్కడికెళ్లిన పోలీసులు, అమ్మాయిలను భయభ్రాంతులకు గురి చేసిన సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.