: గతం వదిలేద్దాం... భవిష్యత్ ఆశాజనకం: ముఫ్తీ
గతాన్ని తవ్వుకుని లాభం లేదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ తెలిపారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, జమ్మూ, లడఖ్, కాశ్మీర్ ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథాన సాగడానికి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారని అన్నారు. ఇప్పుడికి గతాన్ని తవ్వుకుంటూ కూర్చునే ప్రసక్తిలేదని ఆయన తేల్చిచెప్పారు. దేశంలోని మిగిలి రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలిచ్చిన చారిత్రక అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానని ముఫ్తీ స్పష్టం చేశారు.