: పాకిస్థాన్ లో హిందువుల హోలీ సంబరాలు... రక్షణగా నిలిచిన విద్యార్థి సంఘం
పాకిస్థాన్ లోని కరాచీలో హిందువులు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. హిందువులకు విద్యార్థులు తమ సంఘీభావం ప్రకటించారు. హోలీ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసి ఆదర్శంగా నిలిచారు. కరాచీలోని స్వామి నారాయణ్ దేవాలయం వద్ద నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు హోలీ జరుపుకునే హిందువులకు మానవ కవచాలుగా నిలిచారు. ఇది పాక్ భవిష్యత్తుపై సానుకూల సంకేతాలు చూపుతోంది. మత ఛాందసవాదం అణువణువునా నింపుకున్న పాకిస్థాన్ లో హిందువులు హోలీ జరుపుకోవడం శుభపరిణామమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.