: డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నూ వదలని జులాయి
మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. దేశంలో ఎక్కడో ఓ చోట మహిళలు లైంగిక దాడికి గురవ్వడం గురించిన వార్తలు వింటూనే ఉన్నాము. అయితే, యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ ను కూడా వేధించిన జులాయిల గురించిన వార్తలు కాస్త అరుదే. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కోల్ కతాలో వెలుగు చూసింది. గత రాత్రి తల్తలా ప్రాంతంలో డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ను అడ్డుకున్న యువకుడు, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.