: ఉత్కంఠభరిత మ్యాచ్ లో విజయం... క్వార్టర్ ఫైనల్లో భారత్


ఉత్కంఠభరిత మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. వరుస విజయాలతో 'బి' గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా, మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రపంచకప్ లో ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయాలతో భారత జట్టు దూసుకుపోతోంది. వెస్టిండీస్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యం సాధించేందుకు బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు మరో 65 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లతో విజయం సాధించింది. రోహిత్ శర్మ, ధావన్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయిన భారత జట్టు ఇన్నింగ్స్ కు నిలకడ తెచ్చేందుకు కోహ్లీ (33), రహానే (14) ప్రయత్నించినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పారేసుకున్నారు. దీంతో రైనా (22) జాగ్రత్తగా ఆడినా కొద్ది స్కోరుకే వికెట్ కోల్పోయాడు. దీంతో, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ (45 నాటౌట్), జడేజా (13), అశ్విన్ (16 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. దీంతో, టీమిండియా ఓటమన్నదే ఎరుగుకుండా క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. అద్భుత ప్రదర్శనతో విండీస్ ను కట్టడి చేసిన మహ్మద్ షమీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు.

  • Loading...

More Telugu News