: టి.కాంగ్రెస్ లో సీమాంధ్ర నేతల జోక్యమేంటి?: వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ లో సీమాంధ్ర నేతల జోక్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు. టి.పీసీసీ కొత్త అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కల నియామకంపై సీమాంధ్ర నేతలు జోక్యం చేసుకున్నారని విలేకరులతో అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఎన్నికలకోసం పవన్ ను వాడుకున్న తెలుగుదేశం ఇప్పుడు ఆయనకు రాజకీయ అనుభవం లేదనడం విడ్డూరమన్నారు. పవన్ లానే ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా బాధితుల తరపున పోరాడాలని సూచించారు. ఇదిలా ఉంటే, పార్టీ అంతర్గత విషయాలను వీహెచ్ బయటపెట్టారంటూ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.