: స్వాతంత్ర్య సమరయోధుడు కంది మల్లారెడ్డి మృతి
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, వరంగల్ జిల్లా కమ్యూనిస్టు నేత కంది మల్లారెడ్డి కన్నుమూశారు. రైతు సంఘం నేతగా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంత్సరాలు. గతవారం ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో, హైదరాబాదులోని నిమ్స్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో, ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అన్ని పార్టీలకు చెందిన పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామన్న బాధను వ్యక్తీకరించారు.