: శ్రీరామచంద్రుడుకి నేడు పట్టాభిషేకం
అంగరంగ వైభవంగా నిన్న సీతమ్మను పెండ్లాడిన కోదండరాముడికి నేడు భద్రాద్రిలో కన్నుల పండువగా పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనడానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. ఖమ్మం జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి, జిల్లా కలెక్టర్ తదితరులు గవర్నర్ కు స్వాగతం పలికారు. అటు శ్రీరామపట్టాభిషేకం మహోత్సవాన్ని తిలకించేందుకు నేడు కూడా భద్రాద్రికి భక్తులు పోటెత్తారు.