: ముస్లిం మహిళలను కూడా పెళ్లి చేసుకోవాలని బీజేపీ నేతలకు అజం ఖాన్ సూచన
ఉత్తరప్రదేశ్ మంత్రి అజం ఖాన్ మరొక వివాదం సృష్టించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముస్లిం యువతులను పెళ్లి చేసుకోవాలని బీజేపీ నేతలు షానవాజ్ హుస్సేన్, ముక్తార్ అబ్బాస్ నక్వీలకు సూచించారు. "హిందూ మతానికి చెందిన మహిళలను వివాహం చేసుకుని వారు లవ్ జిహాద్ కు పాల్పడ్డారు. ఇప్పుడు వారు ముస్లిం మహిళలను తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. ఇస్లాం మతంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతిస్తారు. సాధ్వీ ప్రాచీ ఈ విషయంపై కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. ఒక మహిళ 40 మంది పిల్లలను కనలేదు కదా?" అని మీడియాతో అజం అన్నారు. షానవాజ్ హుస్సేన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ హిందూ మహిళలను పరిణయమాడారు.