: ఐదో వికెట్ కోల్పోయిన విండీస్... సత్తా చాటుతున్న టీమిండియా బౌలర్లు


టీమిండియా బౌలర్ల ధాటికి కరీబియన్ బ్యాట్స్ మన్ బెంబేలెత్తిపోతున్నారు. దీంతో విండీస్ వికెట్లు వరుసగా పతనమవుతున్నాయి. 9 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే క్రమంలో నింపాదిగా బ్యాటింగ్ చేసిన లెండిల్ సిమ్మన్స్(9) ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోలేకపోయాడు. 19వ ఓవర్ తొలి బంతికి మోహిత్ శర్మ సిమ్మన్స్ ను బోల్తా కోట్టించాడు. శర్మ బంతిని లాంగాన్ మీదుగా బౌండరీకి తరలించే యత్నంలో సిమ్మన్స్, ఉమేశ్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో 20 ఓవర్లలోపే విండీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. 19 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్ 67 పరుగులు చేసింది. జోనాథన్ కార్టర్ (21)తో డ్యారెన్ స్యామీ (0) జతకలిశాడు.

  • Loading...

More Telugu News