: తుళ్లూరులో చంద్రబాబు సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది: జగన్
నవ్యాంధ్ర రాజధాని పేరిట తుళ్లూరులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, రాజధాని నిర్మాణానికి అవసరమైన మేర ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.