: రెండో వికెట్ కోల్పోయిన విండీస్


భారత్ తో జరుగుతున్న వన్డేలో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలుతోంది. 15 పరుగుల వద్ద విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. 7వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో గేల్స్ మిడ్ ఆన్ మీదుగా ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి పరుగెత్తుకుంటూ వచ్చిన మోహిత్ శర్మ క్యాచ్ ను అందుకోలేకపోయాడు. ఇదే సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న శామ్యూల్స్ రన్ కోసం పరుగెత్తాడు. కానీ, గేల్ మాత్రం బాల్ వైపే చూస్తూ క్రీజ్ లోనే ఉండిపోయాడు. దీంతో, మోహిత్ శర్మ బాల్ విసరడం, విరాట్ కోహ్లీ బాల్ అందుకుని వికెట్లను గిరాటేయడంతో... శామ్యూల్స్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. అంతకు ముందు క్రిస్ గేల్ కు ఓ లైఫ్ దొరికింది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 8.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు. గేల్ 2 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 21 పరుగుల వద్ద ఆడుతున్నాడు. గేల్ కు తోడుగా కార్టర్ బరిలోకి దిగాడు.

  • Loading...

More Telugu News