: 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో వ్యాఖ్యాత సుమ
బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను గత కొన్నేళ్ల నుంచి అలరిస్తున్న ప్రముఖ వ్యాఖ్యాత సుమ కనకాల 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కించుకుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న 'స్టార్ మహిళ' కార్యక్రమానికి అత్యధికకాలం వ్యాఖ్యాతగా చేస్తున్నందుకుగానూ ఆమె జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినట్టు లిమ్కా సంస్థ యాజమాన్యం తెలిపింది. గతేడాది జులైకి 1815 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్నందుకు గానూ లిమ్కా బుక్ రికార్డులకెక్కి ఘనత సాధించింది. 2008లో ప్రారంభమైన 'స్టార్ మహిళ' గృహిణులను, యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకూ ఈ కార్యక్రమం 2045 ఎపిసోడ్లు పూర్తిచేసుకుని విజయవంతంగా ప్రసారమవుతోంది.