: ఆదిలోనే వికెట్ కోల్పోయిన విండీస్... స్కోర్ 10/1
పెర్త్ లో భారత్ తో జరుగుతున్న వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ విసిరిన బంతికి డ్వేన్ స్మిత్ ఔట్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం, గేల్ (1) కు శామ్యూల్స్ జత కలిశాడు. ప్రస్తుతం విండీస్ స్కోర్ 6 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు.