: ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ హోలీ కానుక... రూ.186 కోట్ల నీటి సర్ చార్జీల రద్దు!
తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బంపర్ ఆపర్ ప్రకటించారు. హోలీ పర్వదినానికి ఒక్క రోజు ముందుగా ఆయన తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ తమకు అసలైన హోలీ బహుమతిని అందించారని సంబరపడుతున్నారు. నీటి బిల్లుల జాప్యానికి చెల్లించాల్సిన సర్ చార్జీలు రూ.186 కోట్లను రద్దు చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నిన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీ జల బోర్డు చైర్మన్ హోదాలో ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.