: ఈసారి అత్యధికులు వీక్షించిన మ్యాచ్ భారత్-పాక్ మ్యాచ్ కాదు


వేదిక ఏదయినా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే దానికి ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. మ్యాచ్ లో ప్రపంచ రికార్డులు బద్దలుకానప్పటికీ, వీక్షణలో రికార్డులు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి అత్యధిక వీక్షకులు చూసిన మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కాదంటే విశేషమే మరి. కానీ అదే నిజమని వరల్డ్ కప్ నిర్వాహకులు అంటున్నారు. ఈసారి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను అత్యధికులు వీక్షించారట. ఈ మ్యాచ్ ను ఏకంగా 257 మిలియన్ల మంది క్రీడా ప్రేమికులు చూశారట. గత నాలుగేళ్లలో ఇంత పెద్ద వ్యూవర్ షిప్ ఉన్న కార్యక్రమం ఏదీ లేదని వారు తెలిపారు. నాలుగేళ్ల క్రితం జరిగిన భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను అత్యధికులు వీక్షించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News