: పవన్ కల్యాణ్ సూచనలు పరిశీలిస్తాం: మంత్రి ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో బాగానే పనిచేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సూచనలు పరిశీలిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటి వరకు ఎలాంటి బలవంతపు భూసమీకరణ జరగలేదని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఏ రైతూ కన్నీరు పెట్టకూడదన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే త్యాగాలు తప్పవని ఆయన సూచించారు. భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రభుత్వానికి ఉన్నత లక్ష్యాలు ఉండాలని తమకు కూడా అలాంటి లక్ష్యాలే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.