: గేల్, డివిలీర్స్, మ్యాక్స్ వెల్ లాంటి వాళ్లకు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: అశ్విన్
బౌలర్లకు సవాలు విసిరే క్రిస్ గేల్, డివిలీర్స్, మ్యాక్స్ వెల్ లాంటి ఆటగాళ్లకు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని టీమిండియా ఆఫ్-స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. రేపు విండీస్ తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ, విధ్వంసక బ్యాట్స్ మన్ ఆటకట్టించడంలో ఆనందం ఉంటుందని, ఆ సవాలును సదా స్వీకరిస్తానని అన్నాడు. అందుకే వారికి బౌలింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. రేపటి మ్యాచ్ కు సన్నద్ధమవుతున్నామని, విండీస్ పై విజయం సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందని అశ్విన్ తెలిపాడు.