: ఎన్నికల్లో అవినీతికి తమిళనాడు ప్రథమ రాష్ట్రం: అమిత్ షా
ఎన్నికల్లో అవినీతికి పాల్పడటంలో దేశంలోనే తమిళనాడు మొదటి రాష్ట్రమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. ఇక్కడ డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందుకని పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి, ఎన్నికల్లో నగదు ప్రవాహం జరగకుండా తనిఖీలు చేయాలని సూచించారు. కోయంబత్తూర్ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర, జిల్లాల ఆఫీస్ బేరర్ల తొలి సమావేశంలో షా ప్రసంగించారు. కాబట్టి బూత్ స్థాయిలోనే ఇలాంటి ఘటనలు జరగకుండా బలోపేతం చేయాలన్నారు.