: పులివెందులలో మధ్యాహ్న భోజనం కలుషితం... 30 మంది చిన్నారులకు అస్వస్థత
ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం కలుషితమవడంతో, ఏకంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కడప జిల్లా పులివెందులలోని రమణప్ప సత్రం స్కూల్లో జరిగింది. భోజనానంతరం విద్యార్థులు వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలతో బాధపడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. అనారోగ్యం పాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.