: రాజధానికి వెయ్యెకరాలు చాలట... లెఫ్ట్ పార్టీల ఆఫీసులకు పదెకరాలు కావాలట: చంద్రబాబు


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విస్తీర్ణంపై పలు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫైరయ్యారు. కొత్త రాజధాని నిర్మాణంపై రాజకీయ పార్టీలకు ఓ విజన్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఆయన రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని కోసం వెయ్యెకరాలు చాలంటున్న వామపక్షాల వాదనపై చంద్రబాబు ఒంటికాలిపై లేచారు. తమ కార్యాలయాల నిర్మాణం కోసం పదెకరాలు కావాలని అడిగే వామపక్షాలు, కొత్త రాజధానికి మాత్రం వెయ్యెకరాలు చాలని ఎలా చెబుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నవ్యాంధ్ర రాజధానికి రూపకల్పన చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News