: అభిమానులకు సోనమ్ కపూర్ కృతజ్ఞతలు


తాను కోలువాలంటూ కోరుకున్న, ప్రార్థించిన అభిమానులకు అందాల భామ సోనమ్ కపూర్ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు తాను కోలుకున్నానంటూ ట్విట్టర్ లో చెప్పింది. "అందరికీ హాయ్. ప్రస్తుతం నేను చాలా బాగున్నా. నేను కోలుకోవాలని విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు ఈరోజు నేను ఆసుపత్రి నుంచి ఇంకా డిశ్చార్జ్ కాలేదు. మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్" అని సోను ట్వీట్ చేసింది. సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న 'ప్రేమ్ రతన్ ధ్యాయె' చిత్రం షూటింగ్ లో ఉండగా... సోను స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్టు గుర్తించి గుజరాత్ లోని రాజ్ కోట్ లో పరీక్షలు చేసుకుంది. పరీక్షలో పాజిటివ్ గా రావడంతో గత ఆదివారం వెంటనే ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటోంది.

  • Loading...

More Telugu News