: తిరుమలలో భక్తులు లేరు... లడ్డూలు దొరకడం లేదు!
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం 10 గంటల సమయంలో సర్వదర్శనం కోసం కేవలం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్టంగా 2 గంటల లోపే దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. నడకదారిలో వచ్చిన భక్తులకు గంటన్నర, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. కాగా, లడ్డూ ప్రసాదం టోకెన్లు జారీ చేసే కంప్యూటర్ వ్యవస్థ స్తంభించింది. దీంతో, టోకెన్ల జారీ నిలిచిపోగా, రెండు గంటల నుంచి భక్తులు అదనపు లడ్డూ కౌంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.