: కడుపులో కత్తులు... పెదవులపై చిరునవ్వులు: సీమాంధ్రులపై కేటీఆర్


తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సీమాంధ్రుల తీరుపై మరోమారు ధ్వజమెత్తారు. ‘‘ఆంధ్రావాళ్ల కడుపులో కత్తులు... పెదవులపై చిరునవ్వులు చూపిస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వారి మోచేతి నీళ్లు తాగితే మునకేనని టీ టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా టీ టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, తెలంగాణ పునర్మిర్మాణంలో తమతో కలిసి రాకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే మాటల్లో నిలకడ ఉండదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News