: తుళ్లూరు బయలుదేరిన పవన్ కల్యాణ్... సమస్యల నివేదనకు రైతులు సన్నద్ధం!


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరులో పర్యటన కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి బయలుదేరారు. విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునే ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఉండవల్లి చేరుకోనున్నారు. ఉండవల్లితో పాటు బేతపూడి, ఎర్రబాలెం, తుళ్లూరుల్లో పవన్ పర్యటిస్తారు. పవన్ రాక కోసం రాజధాని ప్రాంత రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ వస్తున్న నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్న రైతులంతా గ్రామాల్లో సమస్యల నివేదనకు సిద్ధమయ్యారు.

  • Loading...

More Telugu News