: సన్ ఫార్మా షేరు జోరు... భారత కుబేరుడిగా దిలీఫ్ సంఘ్వీ, రెండో స్థానంలో ముఖేశ్


నిన్న సన్ ఫార్మా షేరు ధర శరవేగంగా పైకెగబాకింది. దీంతో ఆ కంపెనీ యజమాని దిలీప్ సంఘ్వీ భారత అపర కుబేరుడిగా అవతరించారు. రెండు రోజుల క్రితం భారత అపర కుబేరుడంటూ తన జాబితాలో ముఖేశ్ అంబానీని అగ్రసానంలో కూర్చోబెట్టిన ఫోర్బ్స్, తాజాగా తన జాబితాకు స్వల్ప సవరణ చేసింది. తాజా సవరణ ప్రకారం భారత కుబేరుల్లో తొలి స్థానంలో ఉన్న దిలీప్ సంఘ్వీ, ప్రపంచ కుబేరుల జాబితాలో 44వ స్థానంలో ఉన్న తన ర్యాంకును 37కు పెంచుకున్నారు. దిలీప్ సంఘ్వీ సంపద పెరగడంతో 39వ ర్యాంకులో ఉన్న రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేశ్ అంబానీ 43 స్థానానికి పడిపోయారు. కేవలం రెండంటే రెండు రోజుల్లో దిలీప్ సంఘ్వీ, అంబానీ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News