: అనుకున్నట్టే అయింది...ఆప్ నుంచి ఆ ఇద్దరికీ ఉద్వాసన పలికారు


ఆమ్ ఆద్మీ పార్టీ ఫక్తు రాజకీయపార్టీగా మారిపోయింది. వన్ మ్యాన్ షో కనిపిస్తోంది, కేజ్రీవాల్ తో సమాచార సంబంధం తెగిపోయిందని బహిరంగంగా విమర్శించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పార్లమెంటరీ ఎఫైర్స్ కమిటీ నుంచి తొలగించినట్టు ఆప్ ప్రకటించింది. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఆప్ జాతీయ కార్యవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కార్యవర్గం నిర్ణయంపై వారి స్పందన తెలియాల్సి ఉంది. కాగా, తానేమీ తప్పు చేయలేదని, తప్పు చేస్తే చర్యలు తీసుకోవడం సహజమని యేగేంద్ర యాదవ్ తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News