: నిర్భయపై డాక్యుమెంటరీ తీసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు?


నిర్భయ ఉదంతాన్ని 'ఇండియన్ డాటర్' అనే డాక్యుమెంటరీ రూపంలోకి తెచ్చిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహా పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం శాఖ సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. కాగా, ఈ డాక్యుమెంటరీలో నిర్భయ ఉదంతంలో జరిగిన ఘటనలతో పాటు నిర్భయ తల్లిదండ్రుల స్పందన, దోషుల మానసిక స్థితిని తెలిపేందుకు, వారి వాదన వివరించేందుకు జైలులో ఉన్న వారిని డాక్యుమెంటరీ రూపకర్త ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో జరిగిన దారుణానికి కారణమైన బస్సు డ్రైవర్ ముఖేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దానిని బీబీసీ ప్రచురించడంతో వివాదం రాజుకుంది. దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్రం దేశ ప్రజల ఆగ్రహం చల్లార్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News