: పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత పర్యటన రేపే


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాలను రేపు పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి, ఎర్రజెర్ల, బేతంపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని భూసేకరణపై ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి గ్రామం చేరుకుంటారు. గతవారం రాజధాని ప్రాంత రైతులు జనసేన బ్యానర్లతో తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతవారం పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనివార్యకారణాల వల్ల అప్పటి పర్యటన రద్దవ్వగా, రేపు అది కార్యరూపం దాల్చనుంది.

  • Loading...

More Telugu News