: ఆనందం పట్టలేక ఏడ్చిన మంచు లక్ష్మి


మంచు లక్ష్మి ఆనందం పట్టలేకపోయింది. పెళ్లి కొడుకు ముస్తాబులో ఉన్న తమ్ముడిని చూసి కన్నీరు పెట్టుకుంది. సినీ నటుడు మోహన్ బాబు, నిర్మల దంపతులకు ముగ్గురు పిల్లలు. లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్. వీరిలో విష్ణుకు విరోనికాతో వివాహం జరిగింది. ఆ దంపతులకు అరియానా, వివియానా అనే కవలలు జన్మించారు. వీరి ఆలనాపాలనలో లక్ష్మిదే సింహభాగం. విరోనికా స్నేహితురాలు ప్రణతిరెడ్డితో ప్రేమలో పడిన చిన్న తమ్ముడు మనోజ్ నిశ్చితార్థం పార్క్ హయత్ హోటల్ లో వైభవంగా జరిగింది. చిన్ననాటి నుంచి తమ్ముడితో అనుబంధం ఎక్కువగా వుండడం వల్ల, అతని నిశ్చితార్దం వేళ లక్ష్మి కదిలిపోయింది. భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో అక్కను పొదివిపట్టుకుని విష్ణు ఓదార్చడం కనిపించింది. లక్ష్మి, మనోజ్ ఏకమై విష్ణును ఏడిపించిన సందర్భాలు కోకొల్లలని తెలిసిన వారంతా చెప్పుకుంటారు.

  • Loading...

More Telugu News