: స్మార్ట్ సిటీల నిర్మాణానికి టాస్క్ ఫోర్సులు
దేశంలోని మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు టాస్క్ ఫోర్సు బృందాలు ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిర్ణయించారని ఆ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. తొలి దశలో అజ్మీర్, అలహాబాద్, విశాఖపట్టణంలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (యూఎస్ టీడీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందాల్లో పట్టణాభివృద్ధి శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థ, యూఎస్ టీడీఏల ప్రతినిధులు ఉంటారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో ప్రణాళికల అమలుకు కృషి చేస్తారు.