: షిండే సమక్షంలో మోహన్ బాబు విశ్వరూపం


సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మరోసారి విశ్వరూపం చూపారు. సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే సమక్షంలో తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తే, తన చిన్న కుమారుడు మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం ఈ రోజు పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి షిండే కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా, షిండేతో మాట్లాడటానికి జాతీయ ఛానల్ 'టైమ్స్ నౌ'కు చెందిన ప్రతినిధి ప్రయత్నించారు. అయితే, ప్రస్తుతం అలాంటివి వద్దని మోహన్ బాబు సూచించారు. అయినా, సదరు విలేకరి షిండేతో మాట్లాడేందుకు యత్నించారు. దీంతో, మోహన్ బాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. టైమ్స్ నౌ ప్రతినిధిని దాదాపు తోసివేసినంత పని చేశారు. ఓవైపు షిండే వారిస్తున్నప్పటికీ మోహన్ బాబు మాత్రం చల్లారలేదు. ఇదే సమయంలో వీరి దగ్గర మాజీ ఎంపీ మధు యాష్కీ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News