: సెగలు కక్కుతున్న అగ్నిపర్వతం... ప్రవహిస్తున్న లావా
అగ్నిపర్వతం బద్దలైంది. చిలీ దేశంలోని పకాన్ నగరం సమీపంలోని విలారికా అగ్నిపర్వతం పెద్ద స్థాయిలో లావా విరజిమ్ముతోంది. దీంతో దాని పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పొగలు కమ్ముకున్నాయి. అగ్నిపర్వతం స్థితిగతులు క్షుణ్ణంగా గమనిస్తున్న ఎమర్జెన్సీ కార్యాలయ సిబ్బంది రెడ్ అలెర్ట్ జారీ చేశారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. దీంతో చిలీ అధ్యక్షురాలు మిసెల్ బాస్ లెట్ అక్కడ పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, చిలీలో రెండు వేలకుపైగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. వీటిల్లో 90 అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉంటాయి. వాటిలో ఒకటైన విలారికా పర్వతం ఎత్తు 9 వేల అడుగులు, 1984 తరువాత ఇంత భారీ స్థాయిలో లావా విరజిమ్మడం ఇదే తొలిసారి.