: సమరయోధులకు పెన్షన్ నిమిత్తం రూ.705 కోట్లు చెల్లించాం: కేంద్రం


ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే జనవరి 2015 వరకు రూ.705.45 కోట్లు స్వాతంత్ర్య సమరయోధులకు, వారి కుటుంబ సభ్యులకు పింఛన్ గా చెల్లించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్జు, 'స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్' పథకం కింద సమరయోధులకు, వారిపై ఆధారపడిన వారికి 2013-14కు గానూ రూ.826.11 కోట్లు చెల్లించినట్టు వివరించారు. జనవరి 1,2015లో దేశంలోని 11,434 మంది స్వాతంత్ర్య సమరయోధులకు, 24,466 మంది ఆధారపడిన కుటుంబాలకు పింఛన్లు ఇచ్చినట్టు ఓ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. వారిలో తెలంగాణ నుంచి 2,519 మంది సమరయోధులు, మహారాష్ట్ర 1,494, బీహార్ లో 1436 మంది, పశ్చిమ బెంగాల్లో 1294 మంది ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News